ఒక్కరోజే 77 మంది పోలీసులకు కరోనా పాజిటివ్..

Update: 2020-07-01 19:49 GMT

మ‌హారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక పోలీసుల‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ప్ర‌తిరోజు ప‌దుల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 77 మంది పోలీసులకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మ‌హారాష్ట్ర‌లో పోలీసుల‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటింటి.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,015కు చేరింది. ఇక కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 60 మంది పోలీసులు క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయినట్లు మ‌హారాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన ఉన్న‌తాధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Similar News