తమిళనాడులో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడి చేయడానికి చెన్నైతో పాటు మరో మూడు జిల్లాలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేసినప్పటికీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
బుధవారం కొత్తగా 3,882 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి బారిన పడి 63 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాంతకర వైరస్ నుండి కోలుకుని 2,852 మంది డిశ్చార్జ్ అయ్యారు.
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 94,049కు చేరింది. ప్రస్తుతం 39,856 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 52,926 మంది కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా 1,264 మంది ప్రాణాలు కోల్పోయారు.