ఏపీ అసెంబ్లీ, సచివాలయంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా సచివాలయంలో మరో పది మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే అసెంబ్లీలో మరో ఇద్దరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో సచివాలయం, అసెంబ్లీలలో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో సచివాలయాన్ని శానిటేషన్ చేస్తున్నారు.
వరుసగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇరిగేషన్ శాఖలో తాజాగా మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇరిగేషన్ శాఖలో ఉద్యోగులకు జులై 14 వరకు ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.