ప్యాకేజింగ్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Update: 2020-07-02 11:22 GMT

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ భారీ అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలో ఉన్న ప్యాకేజింగ్‌ ప్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున సహిబాబాద్‌ పారిశ్రామిక వాడలోని 4వ నంబర్‌ సైట్‌లో ఉన్న ప్యాకేజింగ్‌ పరిశ్రమలో మంటలు చెలరేగాయి.

ఈ అగ్నిప్రమాదంలో కార్డుబోర్డు బాక్సులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Similar News