ప్రాణాలకు తెగించి నదిలోకి దిగి..

Update: 2020-07-01 19:08 GMT

ఓ మూగ జీవి కళ్ల ముందే గంగా బ్యారేజ్ లో పడిపోయింది. చూస్తూ ఊరుకోలేకపోయారు ఫారెస్ట్ అధికారులు. జింకని ఎలాగైనా రక్షించాలనుకున్నారు. హైదర్ పూర్ కు చెందిన ఫారెస్టర్ మోహన్ యాదవ్ తన ప్రాణాలను పణంగా పెట్టి జింకను కాపాడారు. దాన్ని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. జింకను కాపాడేందుకు తాడు సహాయంతో నదిలోకి దిగి ఒక చేత్తో తాడుని మరో చెత్తో చెత్తని తొలగిస్తూ జింక తోకను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆయన ప్రయత్నం ఫలించి జింకను ప్రాణాలతో పైకి తీసుకురాగలిగారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి రమేష్ పాండే ట్విట్టర్ లో షేర్ చేశారు. ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే క్యాప్షన్ రాస్తూ ఫారెస్ట్ అధికారులు ప్రతి ప్రాణిని రక్షించే ప్రయత్నంలో తమ ప్రాణాలను పణంగా పెడతారు అని పేర్కొన్నారు.

 

Similar News