గురువారం నుంచి గోవాకు పర్యాటకులను అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్గావ్కర్ పేర్కొన్నారు. 250 హోటళ్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించుకునేలా ఉత్తర్వులు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ 250 హోటళ్లు మాత్రమే రిజిస్టర్ చేసుకున్నాయని, వాటిలో ఆతిథ్య సేవలందించేందుకు అనుమతులు జారీ చేశామని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలోకి ప్రవేశించిన పర్యాటకులు 48 గంటల్లోగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ పొందాలని మంత్రి సూచించారు. ఇక్కడ కొవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిందేనన్నారు.