రికార్డ్ స్థాయికి పెరిగిన పసిడి ధర

Update: 2020-07-02 08:13 GMT

పసిడి ధర పరుగులు పెడుతోంది. కరోనా ప్రభావంతో బంగారం ధర పెరుగింది. ఇప్పుడు ప్రజలు పసిడి కొనాలంటేనే భయపడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర బుధవారం హై రేటుకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయంగా బంగారం ధర 8 ఏళ్ల గరిష్టాన్ని అందుకుంది.

ప్రస్తుతం ఆషాఢ మాసం ధర తగ్గుతుందోమోనని పసిడి ప్రియులు ఎదురు చూస్తుంటే.. వారికి షాక్ ఇస్తూ పసిడి ధర పరుగులు పెడుతుంది. తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.50,950కి చేరుకుంది. ఇక 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.46,740గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.48,750గా ఉంది. అలాగే 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.47,550గా రికార్డు క్రియేట్ చేసింది.

Similar News