కానిస్టేబుల్‌పై మావోయిస్టుల దాడి

Update: 2020-07-02 14:22 GMT

చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఓ కానిస్టేబుల్‌ను హతమార్చారు. సాయుధులైన కొందరు మావోయిస్టులు రాత్రి కానిస్టేబుల్‌ ఇంటికి వెళ్లి దాడి చేశారు. జాంగ్లా పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న.. కానిస్టేబుల్ రెండు రోజుల కిత్రమే సెలవుపై ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు కానిస్టేబుల్‌ ఇంటికి వెళ్లి అతన్ని కొట్టి హతమార్చారు. అడ్డువచ్చిన కానిస్టేబుల్‌ తల్లిదండ్రులపై కూడా దాడి చేశారు.

Similar News