ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కాన్పూర్‌లో రౌడీలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రాతోపాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.
రౌడీ షీటర్ వికాస్‌దూబేను పట్టుకునేందుకు డీఎస్పీ నేతృత్వంలో 16 మంది టీమ్ గురువారం రాత్రి కాన్పూర్ వెళ్లింది. అయితే అప్పటికే భవనంపై తుపాకులతో సిద్ధంగా ఉన్న వికాస్‌దూబే ముఠా సభ్యులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది పోలీసులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వారిని దగ్గరలోని హాస్పిటల్‌కి తరలించారు. పోలీసులపై కాల్పులు జరిపిన క్రిమినల్స్ అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు రౌడీముఠా కోసం గాలింపు చేపట్టారు.
పోలీసుల మృతి ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. మృతుల కుంటుంబాలకు సానుభూతి తెలిపారు. కాల్పులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.