డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 9638 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Update: 2020-07-02 21:20 GMT

గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 9638 ఖాళీలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా 43 గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్లను నియమించనుంది. తెలుగు రాష్ట్రాల్లో అయిదు ఆర్ ఆర్ బీల్లో 836 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీకి సంబంధించి 366, తెలంగాణకు సంబంధించి 479 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 21, 2020. వివరాలకు https://ibps.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చు.

అర్హతలు: ఆఫీస్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఏ ప్రాంతానికి దరఖాస్తు చేసుకుంటున్నారో అక్కడి స్థానిక భాషపై పట్టు ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ, అగ్రికల్చర్, హార్టీ కల్చర్, ఫారెస్టీ తదితర విభాగాల్లో డిగ్రీ చేసిన వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. స్థానిక భాష తెలిసి ఉండాలి. స్కేల్ 1 ఆఫీసర్ గా చేరిన అభ్యర్థి మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్/రీజనల్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయి వరకు ఆపై ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. అసిస్టెంట్ గా జాయిన్ అయిన అభ్యర్థులు చీఫ్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయిల వరకు చేరుకోవచ్చు. స్కేల్ 2,3 ఆఫీసర్ ఉద్యోగాలకు డిగ్రీతో పాటు కొన్ని అదనపు అర్హతలు, అనుభవం అవసరం.

Similar News