డాక్టర్లు, నర్సులకు శుభవార్త చెప్పిన ఇండిగో

Update: 2020-07-02 19:45 GMT

కరోనా మహమ్మారితో ముందు వరసలో ఉండి పోరాటం చేస్తున్న డాక్టర్లు, నర్సులకు ఇండిగో ఎయిర్ లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వారియర్స్ తమ విమానాల్లో 25 శాతం డిస్కౌంట్ కు ప్రయాణించవచ్చని గురువారం ప్రకటించింది. ఈ ఏడాది చివరి వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే, ఈ సౌకర్యాన్ని పొందాలి అంటే మెడికల్ ఐడీ ప్రూఫ్ ఉండాలని స్పష్టం చేసింది. కరోనా వలన లాక్ డౌన్ విధించడంతో మే25 వరకూ దేశీయ విమానాలు రాకపోకలు నిలిచిపోయాయి. మే 25 తరువాత విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ.. ప్యాసింజర్లు పెద్దగా లేకపోవడం గమనార్హం.

Similar News