నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

Update: 2020-07-03 08:33 GMT

మహారాష్ట్రలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మహిళా ఎమ్మెల్యేకు కరోనా సోకింది. థానే జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని అధికారులు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే భర్తకు టెస్టులు చేయగా ఆయనకు కూడా కరోనా ఉందని తేలింది. దీంతో వారిద్దరిని హోం క్వారంటైన్ చేశారు.

గతంలో థానే జిల్లాలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీకి కరోనా బారిన పడ్డారు. థానే జిల్లాలోనే మరో మహిళా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో థానే జిల్లాలో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది.

Similar News