కరోనా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో బీహార్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, కరోనా బాధితులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించనుంది. ఈ కరోనా సమయంలో ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలైన్లో నిలబడితే.. మహమ్మారి వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఎలక్షన్ కమిషన్ అభిప్రాయపడింది. ఇప్పటి వరకూ ఎన్నికల విధులు నిర్వహించే కొంతమంది సిబ్బందికి, పోలీసులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉండేది. కానీ, ఈసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో కరోనా బాధితులకు, వృద్దులకు కూడా ఈ అవకాశం లభిస్తుంది.