మహారాష్ట్రలో భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో రహదారులు చెరువులను తలపించాయి. ఇక వివిధ అవసరాల నిమిత్తం బయటకు వచ్చిన జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబై పోలీసులు, విపత్తు నిర్వహణ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి.