మహమ్మారి కరోనా మనుషులను మృగాలుగా మార్చేస్తోంది. కరోనా సోకిందని తెలిస్తే దగ్గరకు వెళ్లలేకపోతున్నారు.. మరణిస్తే అంత్యక్రియలకూ హాజరవ్వలేకపోతున్నారు. తాజా ఘటన ఇందుకు నిదర్శనం. కనిపెంచిన తల్లికి కరోనా సోకిందని 70ఏళ్ల ఆ వృద్ధురాలిని బస్టాండ్ లోనే వదిలేసి వెళ్లి పోయాడు కొడుకు. పాపం ఆ తల్లి మనసు ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటుంది. కన్న కొడుకే కాదన్నాడు ఇంకెక్కడికి వెళుతుంది. ఈ ఘటన మాచర్ల బస్టాండ్ లో చోటు చేసుకుంది.
పాల్వని కొంత కాలంగా గోవాలోని కూతురు వద్ద వుంటోంది. రెండు రోజుల క్రితం పెన్షన్ తీసుకుందామని గోవా నుంచి మాచర్ల వచ్చింది. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఆమెకు వైద్యులు కరోనా టెస్టు చేశారు. పాజిటివ్ అని తేలడంతో ఆమె కుమారుడు వెంకటేశ్వరరావు తల్లిని బస్టాండ్ లోనే వదిలేసి వెళ్లిపోయాడు. పాల్వనిని గమనించిన పోలీసులు ఆమెను గుంటూరులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.