రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 200 రోజులకు చేరింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి స్ఫూర్తితో అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
అమరావతిని ఎవరూ ఏమీ చేయలేరని, దానికి ఓ చరిత్ర ఉందన్నారు. ప్రాచీన నాగరికతకు చిహ్నమని, శాతవాహనుల రాజధాని అని తెలిపారు. అమరావతి అజరామరమని పేర్కొన్నారు.
మరోవైపు జేఏసీ నాయకులు రాజధాని కోసం ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మహిళా జేఏసీ నేతలు ఒకరోజు దీక్ష చేశారు.