ఒడిశాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. శుక్రవారం కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 561 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఒడిశాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,106కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 2,567. కరోనా మహమ్మారి కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 29కి చేరింది.