దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీలో రోజు రోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ సబ్ ఇన్ స్పెక్టర్ కరోనాతో మృతి చెందారు. శుక్రవారం ఎస్ఐ ప్రాణాలు కోల్పోవటంతో.. మిగతా పోలీసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఎస్ఐ ధరంవీర్ సింగ్ బైపాస్ సర్జరీ కోసం.. నోయిడాలోని కైలాష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. జున్ 13న అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. రిపోర్టులో నెగిటివ్ అని తేలింది. ఈ నేఫథ్యంలో జూన్ 22న ఎస్ఐకి బైపాస్ సర్జరీ చికిత్స చేశారు. అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కంటే ముందు.. ఎస్ఐకి కరోనా పరీక్షలు మరోసారి నిర్వహించారు. ఈ ఫలితాల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. శుక్రవారం ఉదయం ఎస్ఐ ధరంవీర్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎస్ఐ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.