కొడుకు పుట్టిన సంతోషంలో పార్టీ ఇచ్చిన ఎస్సై.. కానిస్టేబుల్ కి కొవిడ్

Update: 2020-07-04 17:59 GMT

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రముఖ పాత్ర పోషించింది పోలీస్ డిపార్ట్ మెంట్. బెంగళూరు బళ్లారి జిల్లా కంప్లి పోలీస్ స్టేషన్ లో ఓ ఎస్ ఐ విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు వారం రోజుల క్రితం కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన ఆనందం ముందు కరోనా గుర్తుకు రాలేదు. పార్టీ చేసుకోవడానికి ఓ కారణం దొరికిందని సంతోషపడ్డారు. పార్టీకి డిపార్ట్ మెంట్ కి చెందిన 19 మంది పోలీసులు హాజరయ్యారు. పార్టీలో మద్యం సేవించిన ఓ కానిస్టేబుల్ అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తీస్కెళ్లారు. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో పార్టీకి వెళ్లిన వాళ్లందరికీ కొవిడ్ భయం పట్టుకుంది. కంప్లి పోలీస్ స్టేషన్ తో పాటు పార్టీ జరిగిన గెస్ట్ హౌస్ ను సైతం వైద్యులు మూసివేశారు. కరోనాను ఖాతరు చేయక పార్టీలు చేసుకుని కోవిడ్ బారిన పడుతున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News