శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం

Update: 2020-07-04 09:37 GMT

శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరుగనుంది. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని టీటీడీ నిర్వహించనుంది. దర్శన విధివిధానాలపై పాలకమండలి చర్చించనుంది.

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ప్రస్తుతం 12వేల మంది భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే ఈ సంఖ్యను పెంచే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడుతున్న టీటీడీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాలకమండలి చర్చించనుంది. ఇక టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

Similar News