32 మంది పదవతరగతి విద్యార్థులకు కరోనా పాజిటివ్..

Update: 2020-07-04 18:39 GMT

బెంగళూరు వాసులను కరోనా కలవరపెడుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తున్న విద్యాశాఖ.. తాజాగా 32 మంది పదవతరగతి విద్యార్థులకు కరోనా సోకడంతో ఆందోళన చెందుతోంది. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి పరీక్షలకు హజరవుతున్నా విద్యార్ధులు వైరస్ బారిన పడ్డారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారులు విద్యార్ధులకు ధైర్యం చెబుతున్నా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు భయపడుతున్నారు. కాగా, రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 70-80 శాతం ఒక్క బెంగళూరులోనే నమోదవడంతో భయాందోళనలు నెలకొన్నాయి. జూన్ నెలలో బెంగళూరులో మొత్తం 4,198 మంది కరోనా బారిన పడగా, అందులో 85 మంది మరణించారు. 312 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జూన్ 1నుంచి 15వ తేదీ వరకు బెంగళూరులో పరిస్థితి సాధారణంగానే ఉంది. కానీ 16 వ తేదీ నుంచి కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది.

Similar News