నిరుపేదల గుడిసెలను కూల్చివేసిన జగన్ సర్కార్

Update: 2020-07-05 14:17 GMT

టీడీపీని టార్గెట్ చేసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఏ పాపం ఎరుగని పేద ప్రజలని కూడా అష్టకష్టాలకు గురిచేస్తోంది. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో ఇళ్లపట్టాల పేరుతో నిరుపేదలు నివాసం ఉండే గుడిసెలను కూల్చివేశారు. అధికారులను ముందుపెట్టి వెనుకనుంచి వైసీపీ నేతలు చక్రం తిప్పుతున్నారు.

శివన్ననగర్ లోని ఎన్టీఆర్ గృహల భూములకు విలువ పెరగడంతో వాటిని తమ వర్గీయులకు కట్టబెట్టేందుకు పావులు కదిపారు. బాధితులు కాళ్ళా వేళ్ల పడ్డా కనికరం లేకుండా జెసిబితో నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేసింది. కన్నీరుమున్నీరవుతున్నా బాధితులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.Full View

Similar News