ఢిల్లీలో కరోనావైరస్ తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అందులో ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని. ఇంట్లోనే ఎక్కువ మంది కోలుకుంటున్నారని అన్నారు. గత వారం, రోజూ 2300 మంది దాకా రోగులు కోలుకున్నారని స్పష్టం చేశారు.
ఆసుపత్రులలో 9900 పడకలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకూ 97200 మందికి కరోనా సోకగా.. ఇందులో 68256 మంది కోలుకున్నారు. ఇక 3004 మంది రోగులు మరణించారు. ప్రస్తుతం 25940 యాక్టీవ్ కేసులున్నాయి.