ఢిల్లీలో లక్షకు చేరువలో కరోనా కేసులు

Update: 2020-07-04 23:05 GMT

దేశ రాజధానిలో కరోనా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో 2,505 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు ఒక్కరోజులోనే 55 మంది కరోనాతో మృతి చెందారని ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా రోగుల సంఖ్య 97,200కి చేరింది. ఇప్పటివరకూ 68,256మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 25,940మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ కరోనా సోకి 3004 మంది మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

 

Similar News