మహారాష్ట్రలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

Update: 2020-07-04 23:40 GMT

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఆందోళన కలిగిస్తుంది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 7,074కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,00,064కి చేరింది. ఒక్కరోజే 295 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మ‌ృతుల సంఖ్య 8,671కి పెరిగింది. కాగా, ఇంకా రాష్ట్రంలో 83,295మంది చికిత్స పొందుతున్నారు.

Similar News