రాజధాని నగరమైన బెంగుళూరులో కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 33 గంటలపాటు లాక్ డౌన్ ను విధిస్తున్నట్టు పేర్కొంది. శనివారం రాత్రి 8 గంటలనుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. ఈ 33 గంటలు కేవలం అవసరమైన షాపులు మాత్రమే తెరవడానికి అనుమతి ఇచ్చారు. ప్రజలెవ్వరూ బయటికి రాకూడదని మార్గదర్శకాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా బయట సంచరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
మరోవైపు కరోనా పరిస్థితిని గ్రౌండ్ లెవల్ నుంచి పర్యవేక్షించడం కోసం బెంగళూరులో 8,800 కమిటీలతో సహా రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది. ఈ కమిటీలను 33 గంటల లాక్ డౌన్ అనంతరం ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న రోగులకు హోమ్ క్వారంటైన్ ను 14 నుండి 17 రోజులకు పెంచింది, అలాగే అసింప్టోమాటిక్ రోగులు కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండటానికి టాస్క్ ఫోర్స్ మార్గదర్శకాలను విడుదల చేసింది.