Pulwama : సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్ పై ‘ఐఈడి’తో దాడి..

Update: 2020-07-05 03:44 GMT

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. ఓ రహదారి వద్ద ఐఇడితో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) కాన్వాయ్పై ఆదివారం దాడి జరిగింది. పేలుడు జరిగిన తరువాత కాల్పులు జరిగాయి

కాల్పుల్లో ఒక సిఆర్‌పిఎఫ్ ట్రూపర్ గాయపడ్డారు.ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఘటనకు పాల్పడిన వారిని గుర్తించేందుకు భద్రతా దళాలు ప్రయత్నాలు ముమ్మరంచేసింది. ఆ ప్రాంతమంతా పోలీసులు,ఆర్మీ వలయంలో ఉంది.

Similar News