ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమం ముందుకు కదలడం లేదు.. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడగా, బుధవారం జరగాల్సిన పంపిణీ మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 15న పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సమయంలో ప్రజలంతా ఒకే సారి గుంపుగా వచ్చే అవకాశం ఉండటం,
ఈ క్రమంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉందన్న కారణంతో నాలుగోసారి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది జగన్ సర్కార్. అయితే ఆగస్టు 15న అయినా జరుగుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు చాలా చోట్ల స్థల సేకరణ ఇంకా పూర్తి కాలేదు. దానికి తోడు టీడీపీ ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన స్థలాలను వెనక్కితీసుకొని కొత్తగా ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. దీనివలన ప్రభుత్వం విమర్శలపాలవుతోంది.