ఈ నెల 7, 8 తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్తున్నారు. 7వ తేదీన ఇడుపులపాయ చేరుకొని అక్కడే అతిథిగృహంలో బస చేస్తారు.
8వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించి.. అనంతరం ఆర్‌జీయూకేటీకి చేరుకుని కొత్త భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేస్తారు.. ఆ తరువాత 3 మెగావాట్ల సోలార్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి∙నుంచి తాడేపల్లికి వస్తారు.