ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో 466 మంది పోలీసులకు కరోనా సోకింది. కాగా కోవిడ్ యోధులైన పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. విశాఖ జిల్లాల్లో తొలి 3 నెలల్లో 98 కరోనా కేసులే వచ్చాయని.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని గౌతమ్ సవాంగ్ కొనియాడారు.
ఇప్పటి వరకు 466 మంది పోలీసులకు కరోనా సోకిందని సవాంగ్ తెలిపారు. జూన్ 3 వరకు 45 మంది పోలీసులకే కరోనా సోకిందని.. గత నెల రోజుల్లో 421 మంది పోలీసులకు కరోనా వచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని దశల్లో పోలీసులు ముందుంటారు కాబట్టే వైరస్ బారిన పడుతున్నారని సవాంగ్ చెప్పారు. జూన్ 3 తర్వాత రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిందని సవాంగ్ తెలిపారు.