గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు!

Update: 2020-07-05 19:48 GMT

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి హిమాచల్‌ప్రదేశ్‌లో కాస్త ఊరట కల్గిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఒక్క పాజిటివ్ కేసూ కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,046 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 326 యాక్టివ్‌ కేసులున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News