కర్ణాటకలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో నమోదైన కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 37 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 372కి చేరింది. ఒక్కరోజే 1925 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తాజాగా నమోదైన కరోనా కేసులతో కలిపి కర్ణాటకలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,474కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 13251. కర్ణాటకలో కరోనా నుంచి ఇప్పటివరకూ 9847 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.