తమిళనాడులో 1500 దాటిన కరోనా మరణాలు

Update: 2020-07-05 22:10 GMT

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,150 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాంతకర వైరస్ నుంచి 2,186 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,151కి చేరింది. వీరిలో 46,860మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతన్నారు. కరోనా బారి నుండి 62,778మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా 1,510మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Similar News