గుజరాత్ లో కరోనా వైరస్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి.. ఆదివారం 725 కొత్త కేసులు, 18 మరణాలను నమోదు చేసింది, దీంతో రాష్ట్రంలో మొత్తం 36,191 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1,963 కు చేరుకుంది. సూరత్‌లో ఆదివారం 254 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 218 కేసులు కార్పొరేషన్ ప్రాంతాల నుండి, మరో 36 కేసులు జిల్లా నుండి వచ్చాయి. దీంతో సూరత్‌లో మొత్తం కేసుల సంఖ్య 5,968 కు చేరింది.
అంతేకాదు కొత్తగా ఇక్కడ ఆరు మరణాలు కూడా నమోదయ్యాయి.. ఇందులో నగరంలో ఇద్దరు, జిల్లా మొత్తం నుండి నాలుగు మరణాలు సంభవించాయి.. దీంతో ఇక్కడ మొత్తం మరణాల సంఖ్య 182కి చేరింది. అలాగే అహ్మదాబాద్‌లో 177 కొత్త కేసులు నమోదయ్యాయి, వాటిలో మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాల నుండి 162, జిల్లా నుండి 15 ఉన్నాయి, నగరంలో మొత్తం కేసుల సంఖ్య 21,892 గా ఉంది. అహ్మదాబాద్ నుండి ఎనిమిది మరణాలు కూడా సంభవించాయి.