కొవ్వొత్తుల కంపెనీలో ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

Update: 2020-07-06 10:29 GMT

ఆదివారం ఉత్తరప్రదేశ్ ఘోరం జరిగింది. కొవ్వొత్తి తయారీ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో మంటలు చెలరేగడంతో ఆరుగురు మహిళలతో సహా ఎనిమిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. చనిపోయిన కార్మికులలో 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఈ సంఘటన మోడీ నగర్ లోని బఖర్వా గ్రామం యూనిట్‌లో జరిగింది. మంటల్లో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో 10 కి పైగా ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి,

పోలీసులు బఖర్వా గ్రామానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కార్మికుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.. ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే.. సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కలానిధి నైతాని నుండి ఘటనకు సంబంధించి నివేదికను కోరారు ముఖ్యమంత్రి. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ .4 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ .50 వేలు ఇవ్వనున్నారు.

Similar News