బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుదల కారణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పడిపోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో రూ.50 మేర బంగారం ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,850కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,240 వద్ద నిలిచింది. వెండి 1 కేజీపై రూ.40 తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.48,510కి చేరింది.