కేరళలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు చర్యగా రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయించింది. కోవిడ్ నిరోధక కొత్త మార్గదర్శకాలు, నిబంధనలను తీసుకువచ్చింది. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం మరో ఏడాది పాటు తప్పని సరి చేసింది. ఈ మేరకు కేరళ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది.