దేశంలో కరోనా కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక కర్ణాటకలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ బీ జనార్ధన పూజారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
పూజారికి కరోనా పాజిటివ్ రావడంతో.. ఆయన కుమారుడు సంతోష్ జే పూజారి స్పందించారు. 'నాన్న ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే నాన్న ఆస్పత్రిలో చేరారు' అని సంతోష్ జే పూజారి స్పష్టం చేశారు.
కాగా కర్ణాటక రాష్ర్టంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,474కు చేరింది. మొత్తం కరోనా కేసుల్లో 13,251 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 372 మంది ప్రాణాలు కోల్పోయారు.