ఒక ప్రైవేటు వెబ్ వార్త మరియు ఎంటర్టైన్మెంట్ ఛానల్ కొంతకాలంగా టీవీ5 మీద అబద్ధపు ప్రచారం చేస్తోంది. టీవీ5 తెలుగు న్యూస్ ఛానల్ త్వరలో చేతులు మారుతున్నట్లు ప్రచురించింది. మా ప్రేక్షకులకు తెలియజేస్తున్నది ఏమిటంటే ఈ ప్రచారం పూర్తిగా సత్యదూరం.. దురుద్దేశపూరితమైంది. నకిలీ వార్తలు ప్రచారం చేస్తూ టీవీ5 ప్రతిష్టను దిగజార్చేందుకు కట్టుకథలు అల్లుతున్నారు. ఇక్కడ మేము ఒకటే స్పష్టం చేయదలుచుకున్నాం..
ఆ వెబ్ ఛానల్ ప్రచారం చేస్తున్న వార్తలలో లేశమాత్రమైన నిజం లేదు. అంతేకాదు సదరు వెబ్ ఛానల్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళుతున్నాం. ఇకముందు ఎవరూ.. వ్యక్తి లేదా సంస్థ గురించి అబద్ధపు వార్తలు ప్రచారం చెయ్యకుండా ఆ వెబ్ ఛానల్ మీద మేము తీసుకోబోయే చట్టబద్ధమైన చర్య ముందడుగవుతుంది. - అడ్వకేట్ పీవీజీ ఉమేష్ చంద్ర