ఉత్తర కోస్తా, ఒడిశా మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాల్లో బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమల నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కదులుతాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తా, రాయలసీమల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్రలో రాబోయే 48 గంటలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అలాగే ఉత్తర కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. కాగా రెండు రోజులుగా కోస్తాతో పాటూ రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తుతున్నాయి.