పైసల్దియ్.. కరోనా లేదని చెప్తం: ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం

Update: 2020-07-06 14:24 GMT

డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ప్రాణం పోయాల్సిన ఆస్పత్రి సిబ్బందే డబ్బులిస్తే పాజిటివ్ వచ్చినా నెగిటివ్ అని రిపోర్ట్ రాసిస్తామంటున్నారు. ఉత్తర ప్రదేశ్ మీరట్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది రూ.2500లు ఇస్తే కరోనా లేదని రిపోర్ట్ రాసిస్తామంటూ పేషెంట్ తో బేరాలాడుతున్నారు. ఈ వీడియోని చూసిన ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అధికారులు ఆస్పత్రి సిబ్బందిపై కొరడా ఝళిపించి సదరు ఆస్పత్రి లైసెన్సును రద్దు చేశారు. భవనానికి సీలు వేశారు. ఇట్లాంటి సంక్షోభ సమయంలో కూడా అనారోగ్యకరమైన ఆలోచనలు చేస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి అనీల్ ధింగ్రా హెచ్చరించారు.

Similar News