60 కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబేను పట్టిస్తే రూ.2.5 లక్షలు రివార్డు ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించారు. వికాశ్ దూబేపై ఉన్న రివార్డును పెంచినట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ కార్యాలయంలో ఓ ప్రకటనలో పేర్కొంది.
కాన్పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికాశ్ దూబేనే ప్రధాన నిందితుడు. వికాశ్‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఫైరింగ్ జరిగింది. డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 16 మంది పోలీసుల బృందం గురువారం అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న రౌడీలు దాడి చేశారు. ఈ ఘటనలో దేవేంద్ర మిశ్రా సహా 8మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత గ్యాంగస్టర్ వికాశ్ దూబే ఇంటిని అధికారులు కూల్చివేశారు.