69 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌

Update: 2020-07-07 23:29 GMT

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు, పోలీసులపై కూడా ఈ మహమ్మారి పంజా విసురుతోంది. తాజాగా గడిచిన 24గంటల వ్యవధిలో 64మంది బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు కరోనా బారినపడిన జవాన్ల సంఖ్య 1,454కు చేరింది. వీరిలో 852మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. మంగళవారం ఒక్కరోజే 29మంది జవాన్లు చికిత్సకు కోలుకొని డిశ్జార్జి అయ్యారు. ప్రస్తుతం 595 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Similar News