బుల్లితెర షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఇద్దరు నటులకు కరోనా వచ్చింది. నేను వర్క్ చేసిన సెట్ లో వాళ్లూ ఉండడంతో ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ లో ఉన్నా. అంతే కానీ నాకు ఎటువంటి కరోనా లక్షణాలూ లేవు. ఒకవేళ పాజిటివ్ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇటీవల నేను చేసిన పోస్ట్ ని చూసి అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి అని అంటూ ఝాన్సీ మరొక వీడియోని పోస్ట్ చేశారు. ఐసోలేషన్ కు, క్వారంటైన్ కు తేడా ఉంది. రిస్క్ తీసుకోకూడదని వారం రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. మరో వారం రోజులు ఇంట్లోనే ఉంటా. నా ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటా. నా పట్ల ఇంత కన్సర్న్ చూపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది ఝాన్సీ.