ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కరళా నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి రోజు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1062 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1051 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన మరో 11 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,259కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,894 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి బారినుండి కోలుకుని 11,101 మంది డిశ్చారి అయ్యారు. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 264కు చేరింది.