దేశంలో కరోనా వైరస్ కరళా నృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి బారిన పడి దేశవ్యాప్తంగా ఒక్కరోజే 482 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7.42 లక్షలకు చేరింది. ఇక మొత్తం మరణించిన వారి సంఖ్య 20,642కు చేరింది. ప్రస్తుతం దేశంలో వైరస్ రికవరీ రేటు 61 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.