కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఓ ఖైదీ.. హాస్పిటల్ నుంచి పారిపోయాడు. ఖైదీకి కాపలాగా ఇద్దరు పోలీసులు ఉన్నారు. అయితే పోలీసుల కళ్ళుగప్పి.. హాస్పిటల్ నుంచి ఖైదీ పరారీ అయ్యాడు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఓ దొంగతనం కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తిని ఇటీవలే గ్వాలియర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్టులో పాజిటివ్ గా నిర్ధారణ అవ్వటంతో.. ఖైదీని హాస్పిటల్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసుల కళ్ళుగప్పి.. హాస్పిటల్ నుంచి ఖైదీ పారీపోయాడు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసులను జైలు సూపరింటెండెంట్ మనోజ్ సాహు సస్పెండ్ చేశారు. ఖైదీ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.