జమ్ముకశ్మీర్‌లోభూకంపం సంభవించింది. రాజౌరీలో బుధవారం తెల్లవారుజామున 2.12 నిమిషాలకు భూమి కంపించింది. భూకంపం తీవ్రత 4.3గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. భూకంప కేంద్రం రాజౌరీకి నైరుతి దిశలో 84 కి.మీ. దూరంలో ఉందని తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.