గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ప్రధాన సహాయకుడు అమర్ దూబేని ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో బుధవారం ఉదయం అమర్ దూబేను టాస్క్‌ఫోర్స్ టీమ్ కాల్చి చంపింది.
కాన్పూర్ ఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకరైన అమర్ దూబే బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. అతనికోసం హిమాచల్‌ప్రదేశ్ పోలీసులతో కలిసి యూపీ ప్రత్యేక పోలీసులు గాలింపు చేపట్టాయని తెలిపారు. అమర్ దూబేపై రూ.50 వేల రివార్డు ఉన్నదని తెలిపారు.
కాన్పూర్‌లో ఎనిమిది మంది పోలీసులను చంపిన వికాస్ దూబే ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. విరికోసం 100కుపైగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు గాలిస్తున్నాయి.