దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. చిన్న, పెద్ద డబ్బున్నోడు, డబ్బులేనోడు అనే తేడాలేకుండా కరోనా మహమ్మారి దాని పని అది చేసుకుపోతుంది. తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ కు కరోనా సోకింది. కరోనా సోకిన ట్రాన్స్ జెండర్.. పశ్చిమ బెంగాల్‌లోని ఓ డయాగ్నోస్టిక్ ల్యాబ్ లో పని చేస్తుంది. రక్త నమూనాలు సేకరించే క్రమంలో ఆమెకు కరోనా అంటుకుంది.
సోమవారం సాయంత్రం ట్రాన్స్ జెండర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వటంతో.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఆర్ బంగూరు హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక బెడ్లు కేటాయించారు. కరోనా సోకిన ట్రాన్స్ జెండర్లకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక బెడ్లు కేటాయించిన ఆస్పత్రి ఇదే.
ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక బెడ్లు కేటాయించిన క్రెడిట్ సీఎం మమతా బెనర్జీకే దక్కుతుందని.. ఆరోగ్య శాఖ మంత్రి చంద్రిమ భట్టాచార్య తెలిపారు.
కాగా, పశ్చిమ బెంగాల్ లో ఇప్పటి వరకు 22,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 779 మంది ప్రాణాలు కోల్పోయారు.